రైతులను వేధిస్తున్న చంద్రబాబు : జగన్

13:46 - December 1, 2016

కృష్ణా : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. బందర్ పోర్టు భూ నిర్వాసితులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట భూములకు కాల్వల నీరు ఇవ్వడం లేదన్నారు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు రాకుండా చేశారని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవడానికి వీలు కల్పించడం లేదని చెప్పారు. బందర్ పోర్టుకు మొదటగా ఐదు వేల ఏకరాలు సేకరించారని...  తర్వాత 30 వేల ఎకరాలు వసూలు చేశారని.. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ పేరుతో లక్షా ఐదు వేల ఎకరాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మనకు ఇష్టం లేకన్నా.. మన భూములు భూమి తీసుకుని.. అందులో పావు భాగం తిరిగి ఇస్తారని చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. రాజధానికి భూముల సేకరణ విషయంలో కూడా ప్రజలు, రైతులను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదన్నారు. బాబు పాలనకు మూడేళ్లు పూర్తి అయ్యాయని... ఇంక మిగిలింది రెండేళ్లని తెలిపారు. రాబోయేది మన ప్రభుత్వమని, ప్రజల ప్రభుత్వమని చెప్పారు. అప్పుడు ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss