మోడీ ప్రశంసించిన ఇంజినీర్..కటకటాల్లో..

11:46 - December 3, 2016

ఆయనో యువ ఇంజినీర్..తెలివైన వాడు కూడా. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఇతను ప్రతిభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారు. అంతేగాకుండా ప్రసంసించారు. కానీ ఇతనే కటకటాలపాలయ్యాడు. వివరాలు తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి..అభినవ్ వర్మ చండీఘడ్ కు చెందిన వాడు. యువ ఇంజినీర్. పెద్దనోట్లు రద్దు..రూ. 2వేల నోటుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. దీనిని అవకాశంగా తీసుకున్న అభినవ్ వర్మ రూ. 2 వేల దొంగనోట్లను ముద్రించి..చలామణీ చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. వీవీఐపీలు మాత్రమే వాడే ఎర్రబుగ్గ ఆడీ కారులో వెళుతున్న అభినవ్ వర్మను పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. దీనితో రూ. 42 లక్షల దొంగనోట్లు బయటపడ్డాయి. అభినవ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. పాత రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకుని 30 శాతం కమిషన్ తో నకిలీ రూ. 2000 నోట్లను ఇస్తున్నట్లు తెలుస్తోంది. నోట్లు దొంగనోట్లు తెలియక చాలా మంది మోసపోయినట్లు తెలుస్తోంది. ఎంతమందికి పంచారో..ఎవరెవరికి ఇచ్చారో..ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారో పోలీసుల విచారణలో తెలియనుంది.

మోడీ ఎందుకు మెచ్చుకున్నారో తెలుసా ?
అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అభినవ్ తయారుచేశాడు. కర్రకు ముందు ఏముందో అంధులు తెలుసుకోవడానికి వీలుంటుంది. గోతులు..రాళ్లు..ఇతరత్రా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఆ ఆవిష్కరణ చేసినందుకు మోడీ ఇతడిని జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభలో అభినందించారు. చండీగఢ్‌లోని అతని కార్యాలయంలో ఇప్పుడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

Don't Miss