పోలవరం నిర్వాశితులతో జగన్..

07:28 - December 8, 2016

తూర్పుగోదావరి : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు అన్ని విధాల అండగాల నిలవాలని వైసీపీ నిర్ణయించింది. పరిహారం నుంచి పునరావసం వరకు అన్ని విషయాల్లో చేదోడువాడోడుగా ఉంటామని పార్టీ అధినేత జగన్‌ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వాసితులకు పునరావాసం కూడా అంతే ప్రధానమని తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో జగన్‌ చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన
తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు బుధవారం రాజమండ్రి చేరుకున్న వైసీపీ అధినేత జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ నేతులు, కార్యకర్తలను కలుసుకున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికపై పని చేస్తున్న అధ్యాపకులను జగన్‌ కలుసుకున్నారు. వారి సమస్యలు విన్నారు. ఏళ్లతరబడి తక్కువ జీతంతో పని చేస్తున్న తమ ఉద్యోగాలను క్రబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్ట్‌ అధ్యాకులు కోరారు. ఈ విషయాన్ని అసెంబ్లీ ప్రస్తావించి పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

రంపచోడవరంలో జగన్
రాజమండ్రి నుంచి రంపచోడవరం చేరుకున్న జగన్‌కు గిరిజనులు సంప్రదయాబద్ధంగా స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పోలవరం నిర్వాసితులు జగన్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

రెండోరోజు కూడా జగన్ పర్యటన కొనసాగింపు
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్‌ ఈ సందర్భంగా విమర్శించారు. ఇవాళ రెండో రోజు కూడా జగన్ ఏజెన్సీలో పర్యటిస్తారు. మారేడుమిల్లి నుంచి బయలుదేరి చింతూరు మీదగా కూనవరం చేరుకుంటారు. రేఖపల్లిలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అన్నవరం చేరుకుని కాళ్లవాపు వ్యాధితో మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. అక్కడ నుంచి రాజమండ్రి చేరుకుని హైదరాబాద్‌ బయలుదేరతారు. 

Don't Miss