విశాఖలోకి జగన్ పాదయాత్ర..

07:01 - August 14, 2018

విశాఖపట్నం : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. దాదాపు 50 రోజులపాటు విశాఖ జిల్లాలో జగన్‌ పాదయాత్ర నిర్వహించనున్నారు. 400 కిలోమీటర్ల మేర జగన్‌ జిల్లాలో నడువనున్నారు.జగన్‌ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జిల్లా పార్టీనేతలు పూర్తి చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం గన్నవరం మెట్టు దగ్గర జగన్‌ విశాఖ జిల్లాలోకి ప్రవేశించనున్నారు. జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఏజెన్సీప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుంది.

Don't Miss