మా గొంతు వినిపిస్తాం : పిన్నెల్లి

21:43 - December 2, 2016

విజయవాడ : అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రజలకోసం తమ వాయిస్‌ వినపిస్తూనే ఉంటామన్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సెప్టెంబర్‌ 8,910 తేదీల్లో ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై .. ప్రివిలైజ్‌ కమిటీ ఇచ్చిన నోటీసు ప్రకారం... ఆయన ఇవాళ కమిటీ ముందు హాజరయ్యారు.

ఏపీ అసెంబ్లీ ప్రివిలైజ్‌ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
ఏపీ అసెంబ్లీ ప్రివిలైజ్‌ కమిటీ ముందు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి హాజరయ్యారు.అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమ ప్రవర్తనపై వివరణ ఇచ్చారు. అధికార పార్టీ కక్షతోనే తమను విచారణ పేరుతో వేధిస్తోందని పిన్నెల్లి మండిపడ్డారు.

సెప్టెంబర్‌ 8,9,10 తేదీల్లో హోదాపై చర్చలో వైసీపీ ఎమ్మెల్యేల హల్‌చల్‌
సెప్టెంబర్‌ 8,9,10 తేదీల్లో ప్రత్యేక హోదా అంశం పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యేలు సభా హక్కులను ఉల్లంఘించారంటూ మంత్రి యనమల.. ఆ సమావేశాల్లోనే 12 మంది పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. స్పీకర్ ఈ నోటీస్ ను ప్రివిలేజ్ కమిటీ కి పంపడంతో వైసిపి మ్మెల్యేలు 12 మందికి కమిటీ నోటీసులు పంపింది. అయితే ఇప్పటివరకు కమిటీ ముందు 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరై వివరణ ఇచ్చారు. కోడాలి నాని,చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ,పిన్నెల్లి రామ‌క్రిష్ణా రెడ్డి మాత్రం మొదట హాజ‌రు కాలేదు.దీంతో ఈ ముగ్గురిని శుక్రవారం హాజరు కావాల‌న్న ప్రివిలేజ్‌ కమిటీ ఆదేశించింది.

వైసీపీ పేరుతోనే కమిటీ ముందు జ్యోతుల నెహ్రూ హాజరు
మరోవైపు టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ .. వైసీపీ పేరుతో ప్రివిలేజ్‌ కమిటీకి హాజరుకావడంపై పిన్నెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఉన్నవారు నిజాయితీగా ప్రవర్తించాలన్నారు. జ్యోతుల నెహ్రూకు నీతి , నిజాయితీ ఉంటే.. తమ పార్టీ పేరుతో వ్యవహరించవద్దని పిన్నెల్లి డిమాండ్‌ చేశారు. అధికారపార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రజల పక్షాన తమపార్టీ గళాన్ని వినిపిస్తూనే ఉంటామన్నారు.

కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరో అవకాశం
మరోవైపు ఎమ్మెల్యేలు కోడాలి నాని,చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తాము శుక్రవారం నాటి విచారణకు రాలేమని సమాచారం ఇవ్వడంతో.. వారికి మరో అవకాశం ఇవ్వాల కమిటీ నిర్ణయించింది. అలాగే విచారణ ఎదర్కొంటున్న మొత్తం 12 మంది ఎమ్మెల్యేలతో మరోసారి మాట్లాడాలని కూడా ప్రివిలైజ్‌ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

Don't Miss