ఒక్కో మృతుని కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి : బొత్స

19:48 - December 9, 2016

హైదరాబాద్ : నానక్‌రాంగూడ బిల్డింగ్‌ కూలిన ఘటనలో మృతిచెందిన ఒక్కొక్కరికి 30లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వైసిపి అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన బొత్స.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతులది విజయనగరం జిల్లా కావడంతో బొత్స వారిని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద కూలీలను పొట్టనపెట్టుకున్న భవన యజమాని, బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 

Don't Miss