ఆ ఆకుకూర ధర రూ. 76,000 !!..

14:53 - May 2, 2018

రోజు తినే కూరగాయాలు,ఆకుకూరలు, పండ్లు వంటివాటిలో అత్యంత తక్కువ ధరకు దొరికేది ఏమన్నా వుంది అంటే అది ఖచ్చితంగా ఆకుకూరలే. బలవర్ధకమమైనవి కూడా ఆకుకూరలే. రక్తహీనత వున్నవారికి వైద్యులు చెప్పే సూచన కూడా ఆకుకూరలు తినమనే. అటువంటి ఆకుకూరలు సామాన్యులకు, పేదలకు అందుబాటులో వండేవి ఆకుకూరలు. కానీ ఓ రకం ఆకుకూర మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. దాని ధర వింటే సామాన్యులే కాదు ఓ మాదికి సంపన్నులు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. మరి అంత ఖరీదు ఆ ఆకుకూర ఖరీదు!!!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆకుకూర ‘హాప్ సూట్స్
ఎక్కడైనా సరే ఆకుకూరలు అత్యంత చవగ్గా దొరుకుతాయనేది నిత్య సత్యం. వీటి ధరలు కూడా ఎప్పుడూ కాస్త నిలకడగానే కనిపిస్తుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆకుకూర ‘హాప్ సూట్స్’. ఈ ఆకుకూర ధర కిలో వెయ్యి యూరోలు. అంటే మన కరెన్సీలో రూ. 76,000. తీగజాతి మాదిరిగా కనిపించే ఈ హాప్ సూట్స్‌ను వసంత రుతువులో పండిస్తారు. కాగా పంట వేసిన అతి తక్కువ వ్యవధిలోనే ఈ పంటను కోయాల్సివుంటుంది. లేనిపక్షంలో ఇది తినేందుకు పనికిరాకుండా పోతుందట. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ ఆకుకూరకు అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ పంటను మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో పండిస్తారు. తేలికపాటి తడివాతావరణంలో ఈ పంట చక్కగా పండుతుంది.

Don't Miss