రెండో ఎంఎంటీఎస్ ఇంకెప్పుడు?...

10:12 - December 8, 2016

హైదరాబాద్ : నత్తకు నడకను నేర్పతున్నట్లుగా సాగుతోంది ఎంఎంటీఎస్ రెండవ దశ పనులు. ప్రభుత్వం ప్రజా రవాణాపై ఎన్నో ప్రకటనలు చేస్త్నున్నప్పటికీ అవి ఆచరణకు నోచుకోవడం లేదు. రాజధాని వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే ఎంఎంటీఆఎస్ ఎంఎంటీఆఎస్ రెండవ దశ పనులు మూడడుగులు మందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది.

హైదరాబాద్ నగరంలో ప్రయాణం నరకం..నిత్యం ట్రాఫిక్ జాం
హైదరాబాద్ నగరంలో ప్రయాణమంటేనే నరకప్రాయం. ఎప్పుడు.. ఎక్కడ..ఏ రోడ్డులో ట్రాఫిక్ జాం అవుతుంతో చెప్పలేని పరిస్ధితి. నగరంలో లక్షలాదిగా కొత్త వాహనాలు వచ్చి చేరడం...నగర జనాభా వీపరీతంగా పెరగడమే దీనికి కారణం. అయితే దీనికి తోడు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజా రవాణా అందుబాటులోకి రాకపోవడంతో పాటు ప్రైవేటు వాహనాలు భారీగా పెరుగడంతో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ట్రాఫిక్ కష్టాలకు తగ్గించేందుకు ముందుకువచ్చిన ఎంఎంటీఎస్
ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారంగా ముందుకు వచ్చిందే మల్టీమోడల్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్. ఇప్పటి వరకు సిటీలో ఫలక్ నూమా నుంచి సికింద్రాబాద్ మీదుగా లింగంపల్లి వరకు....నాపంల్లి నుంచి లింగపల్లి మరియు సికింద్రాబాద్ మార్గాల్లో ఈ రైళ్లు 43 కిమీలో మేర పరుగులు పెడుతున్నాయి. ఈ మార్గంలో ప్రతి రోజు లక్షా 50 వేల మంది ప్రయాణీకులు నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. అది కూడా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే.

2014లో ఎంఎంటీఆఎస్ రెండవ దశకు శ్రీకారం
ఎంఎంటీఆఎస్ మంచి ఫలితాలు ఇవ్వడంతో ఎంఎంటీఆఎస్ రెండవ దశకు అధికారులు శ్రీకారం చుట్టారు. 2014 జూలైలో ప్రారంభం అయిన ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2017 నాటికి నగరవాసులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తియి 78 కి.మీ మార్గంలో ఎంఎంటీఆఎస్ అందుబాటులోకి వస్తే 5 లక్షల మంది నగరవాసులు తక్కువ ఖర్చుతో ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుతారు. అయితే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో అలసత్వం వహించడంతో పనులు అనుకున్న స్ధాయిలో జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఎంఎంటీఎస్ రెండవ దశకు రూ. 816.55 కోట్లు

ఎంఎంటీఎస్ రెండవ దశకు మొత్తం 816.55 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా ఇందులో రెండు భాగాలు అంటే 540 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఒక భాగం డబ్బులు రైల్వే శాఖ చెల్లించాలి. అయితే రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు కేవలం 281 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది.నిధుల లేమితో పనులు సకాలంలో పూర్తికావడం లేదు. మరో 12 నెలలు మాత్రమే గడువు ఉండటంతో 55 శాతం పైగా మిగిలిపోయిన పనులను ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తుందని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

వేగంగా పూర్తి చెయ్యాలంటున్న ప్రజలు
హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న పాలకులు ఇప్పటికైనా ప్రజారవాణాపై దృష్టి సారించి ఎంఎంటీఎస్ ను వేగంగా పూర్తి చెయ్యాల్సిన అసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Don't Miss