'డిస్ ప్లే'బొమ్మలతో మహిళలపై గౌరవం తగ్గుతోందట?!

16:07 - June 28, 2018

ఇప్పుడు మార్కెట్ స్లైల్ అంతా ప్రజంటేషన్ పై నడుస్తోంది. ఒక హొటల్ కి వెళ్లామనుకోండి..అక్కడ మనం ఇచ్చే ఆర్డర్ ఆహారం తినేందుకు ఎలా వున్నా చూసేందుకు కలర్ ఫుల్ గా వుండేలా హోటల్ మేనేజ్ మెంట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. డ్రింక్, ఐస్ క్రీమ్, టిఫిన్స్ ఇలా ఏదైనా కలర్ ఫుల్ లుక్ తో వుంటే వాటికి డిమాండ్ పెరుగుతంది. ఇది ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. కటెంట్ కంటే కలర్ ముఖ్యం, టేస్ట్ కంటే లుక్ ముఖ్యం, క్వాలిటి కంటే కలర్ ఫుల్ లుక్ ముఖ్యం. ఇలా ఏ వ్యాపారమైనా మాటలతోను, చూపులతోను ఆకట్టేసుకోవాలి. అప్పుడే ఆ ప్రొడక్ట్స్ కు డిమాండ్ పెరుగుతుంది.

బట్టల షాప్స్ లో ఆకట్టుకునే నమూనా బొమ్మలు..
అలాగే ఏ బట్టల షాపులకు వెళ్లినా అక్కడ చీరలు, డ్రెస్సులు వంటి మెటీరియల్స్ ధరింపజేసిన అందమైన అమ్మాయిల బొమ్మలు డిస్ ప్లేగా కనిపిస్తుంటాయి. ఆ బొమ్మలు మహిళల ప్రభావం మార్కెట్ పై వుంటుంది. మరి అటువంటి డిప్లే బొమ్మలపై ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. దుకాణాల ముందు ప్రదర్శనకు ఉంచే అందమైన అమ్మాయల బొమ్మల ప్రభావం మహిళల్లో ఎలా ఉంటుందనే విషయంపై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సర్వే నిర్వహించి పలు చేదు నిజాలను వెల్లడించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు పెట్టే ఆ బొమ్మల కారణంగా మహిళలపై హీనభావం పెరుగుతోందని సర్వేలో వెల్లడయ్యింది.

మహిళల్లో ఆత్మనూన్యత పెరుగుతోందా?..
ఈ బొమ్మలను చూస్తే మహిళలు తాము ఆ బొమ్మలంత అందంగా, నాజూగ్గా లేమని ఫీలవుతుంటారని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తేలిందట. భారత్‌లోని 420 పట్టణాల్లో సర్వే నిర్వహించి, ఇటువంటి బొమ్మలపై మహిళల అభిప్రాయాలు తీసుకుని టీఐఎస్‌ఎస్ ఈ నివేదిక రూపొందించింది. అభిప్రాయాలు చెప్పిన మహిళల్లో చాలా మంది ఈ బొమ్మలు తమ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు.

Don't Miss