మహిళ ప్రాణాలు తీసిన ఎలుగుబంటి...

09:14 - June 10, 2018

శ్రీకాకుళం : ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జనాలపైకి దాడికి పాల్పడింది. ఒక్కసారిగా హఠాత్ పరిణామంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. ఘటనలో మహిళ మృతి చెందింది. సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఆదివారం ఉదయం చెత్త వేయడానికని కొంతమంది మహిళలు బయటకొచ్చారు. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఓ ఎలుగుబంటి వీరిపై దాడికి పాల్పడింది. ప్రాణాలు రక్షించుకోవడానికి తలో దిక్కుకు పరుగులు తీశారు. ఊర్మిళ అనే మహిళపై దాడికి పాల్పడుతుండగా అక్కడనే ఉన్న కొంతమంది రక్షించడానికని ప్రయత్నించారు. కానీ వారిపై కూడా ఎలుగుబంటి దాడి చేసింది. దీనితో పలువురికి గాయాలయ్యాయి. వీరిని పలాసాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకొచ్చారు. ఆ సమయంలో డ్యూటి డాక్టర్ లేకపోవడంతో వైద్య చికిత్స అందడం ఆలస్యమైంది. చివరకు డ్యూటి డాక్టర్ రావడం..పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఊర్మిళ మృతి చెందింది. గాయపడిన 8మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

Don't Miss