'ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఎం పాదయాత్ర అవసరం'

రాజ్యాంగ రూపకర్త, భారతరత్న అవార్డు గ్రహీత,మేధావి అయిన బీ.ఆర్.అందేద్కర్ మనుమడు .. అంబేద్కర్ వారసత్వాన్నే కాకుండా ఆయన సైద్ధాంతిక వారసత్వాన్ని .. ఆశయాలను కూడా కొనసాగిస్తున్న నాయకుడు..బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి శ్రమిస్తూ ..రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా..ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా..దళిత సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్న నాయకుడు పాటుపడుతూ..ప్రజాఉద్యమాలలో మమేకమవుతున్న అరుదైన నాయకుడు అయిన ప్రకాశ్ అంబేద్కర్ ..ఆ అరుదైన ప్రజా నాయకుడు.. ప్రకాశ్ అంబేద్కర్ తో వన్ టూ వన్ శ్రీధర్ బాబు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం.. ఇటీవల సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రను ప్రకాశ్ అంబేద్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే మహాజన పాదయాత్ర జరుగుతోందన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తామంతా బలపరిచినట్లుగా ఆయన తెలిపారు. నానాటికీ పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా చిన్న చిన్ని పట్టణాలను అభివృద్ధి చేయాల్సిన అవుసరముందన్నారు. చాలా ప్రాంతాలలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయనీ..దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతంగా లేదన్నారు. ఫ్యామిలీ రాజీకీయాలు బలపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు అవేమితో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..ప్రజానాయకుడు ప్రకాశ్ అంబేద్కర్ ఆశయాలు..అభిప్రాయాలేమిటో తెలుసుకోండి..

Don't Miss