కొండను తవ్వి..

20:52 - December 2, 2016

ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టుకున్నారు..ఎలుకను పట్టడం కోసం కొండను తవ్వారు..పిడికెడు అక్రమార్కుల భరతం పడతామంటూ దేశం మొత్తాన్ని పిల్లిమొగ్గలేయిస్తున్నారు.. నల్లధనం, నకిలీ నోట్లంటూ నిలువునా ప్రాణం తీస్తున్నారు.. ఇదే కామెంట్స్ అడుగడుగునా వినిపిస్తున్నాయి.. ఇదేనా నోట్ల రద్దు సాధించింది. సర్కారు చెప్పిన ప్రయోజనాలు ఎటుపోయాయి? నోట్ల రద్దు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోంది? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. ఇప్పుడు క్యూ మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు ఎదురు చూడటం మాత్రమే తెలుస్తోంది. ఇప్పుడు దేశమంతా ఒకేలా చూస్తోంది.. సొమ్ము తమదే..జీతం తమమే.. నూటికి నూరుపాళ్లు నిజాయితీగా సంపాదించిందే.. మరి ఎందుకీ కష్టాలు అని ప్రశ్నిస్తొంది.. ఇంతకూ సర్కారు చెప్పిందేమిటి? జరుగుతున్నదేమిటి? ఇప్పుడు లెక్కలన్నీ స్పష్టం.. చలమణీలో ఉన్న సొమ్మెంత? బ్యాంకుల దగ్గర ఉన్నదెంత? రిజర్వ్ క్యాష్ ఎంత? ప్రతీదీ స్పష్టంగా కనిపిస్తోంది? మరి సర్కారు చెప్పిన నల్లధనం లెక్కలేమయ్యాయి? ఎక్కడకు పోయాయి? ఈ సర్జికల్ స్ట్రైక్ లో గాయపడుతున్నదెవరు? ఇప్పుడు సాధించిందేమిటి?దేశమంతా కనిపిస్తున్న దృశ్యం ఏమిటి?ఆర్ధిక వ్యవస్థకు జరిగిన మేలేమిటి?ఉద్యోగాలు ఊడి రోడ్డున పడిన వారి పరిస్థితేంటి?పనులు లేక పస్తులుంటున్న వారికిచ్చే సమాధానమేంటి?పరిశ్రమలు కుదేలవుతున్నాయి.. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉపాధి దెబ్బతింటోంది.. ఆర్ధిక వ్యవస్థ కోలుకోలేనంత దిగజారిపోతోంది.. నోట్ల రద్దుతో సర్కారు చెప్పిన లాభాలకు భిన్నమైన పరిమాణాలు సంభవిస్తున్నాయా?మళ్లీ అదే ప్రశ్న..నోట్ల రద్దు సాధించిందేమిటి?ఒక్క నిర్ణయం దేశమంతా గగ్గోలు పెట్టేలా ఎందుకు మారింది? ఎవరి ప్రయోజనాలకోసం ఎవరు ఇబ్బందులు పడుతున్నారు?సర్కారు చెప్పిన ప్రయోజనలు ఏమయ్యాయి?నోట్లు రద్దు చేసిన 24 రోజుల తర్వాత వస్తున్న ప్రశ్న ఇది. క్యూలో నిలబడి నిలబడి కాళ్లు నొప్పెట్టిన వాళ్లు అడుగుతున్నారు..దేశభక్తి అంటే ఇదేనేమో అని భ్రమ పడిన వాళ్లూ నోరు తెరుస్తున్నారు.. అసహనం, నిస్సహాయత, అభద్రత, అన్నీ ఒక్కసారి దాడిచేస్తే ఆదుకునేదెవరని ప్రశ్నిస్తున్నారు. అదీ ఒకటే ప్రశ్న.. మీరు చెప్పిందే సాధిస్తున్నారా? మీరు స్పీచ్ ల్లో దంచినదే జరుగుతోందా? ఇదే ఇప్పుడు అడుగడుగునా వినిపిస్తున్న ప్రశ్న.. 

Don't Miss