వినాయక చవితి సందడి...

07:27 - September 12, 2018

హైదరాబాద్ : దేశమంతా వినాయక చవితి సందడి మొదలైంది. ఇప్పటికే ప్రతి వీధిలో వినాయక మండపాలు వెలిశాయి. కొంతమంది ఇప్పటికే బొజ్జ గణపయ్యలను కొనుగోలు చేసి మండపాలకు తరలిస్తుండగా.. మార్కెట్‌లో అనేక రూపాల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. కొంతమంది ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి వినాయక విగ్రహాలను తయారు చేయించుకోగా... పలువురు మార్కెట్‌లో లభ్యమవుతున్న విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు.  ఎన్నో ఏళ్లుగా ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలనే చాలామంది కొనుగోలు చేస్తుండగా.. ఈసారి చాలామంది మట్టి గణేషుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల మాదిరిగానే మట్టి గణపతులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటికే చాలామంది విగ్రహాలను వేలాది రూపాయలకు కొనుగోలు చేసి మంటపాలకు తరలిస్తున్నారు. అయితే.. గతేడాదితో పోలిస్తే రేట్లు పెరిగాయని భక్తులంటున్నారు. మరోవైపు గత రెండు రోజులుగా హైదరాబాద్‌ నగరంలో వర్షం కురుస్తుండడంతో కొనుగోలు ఎలా ఉంటాయోనన్న టెన్షన్‌లో వ్యాపారస్తులు ఉన్నారు. 

Don't Miss