క్యాష్ లెస్ లావాదేవీలపై దృష్టి సారించాం : అరుణ్ జైట్లీ

19:17 - December 8, 2016

ఢిల్లీ : క్యాష్ లెస్ లావాదేవీలపై దృష్టి సారించామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నోట్ల రద్దుపై ప్రజల నుంచి మంచి సహకారం వచ్చిందని తెలిపారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. క్యాష్ లెస్ లావాదేవీలు వేగవంతం చేస్తామని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై 40 శాతం క్యాష్ లెస్ లావాదేవీలు జరుపనున్నట్లు తెలిపారు. కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై పన్నులో 0.75 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజిటల్ మోడ్ లోకి మారడం వల్ల రేట్లు తగ్గుతాయన్నారు. 
డిజిటల్ మనీ దిశగా కేంద్రం అడుగులు 
డిజిటల్ మనీ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. పదివేల మందికిగా పైగా ప్రజలు ఉన్న గ్రామాలకు స్వైపింగ్ మెషిన్లు అందుబాటులో ఉంటాయన్నారు. డిజిటల్ మోడ్ లో రైల్వే టికెటింగ్ తీసుకున్న వారికే రూ.10 లక్షల భీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. డిజిటల్ పద్ధతిలో తీసుకునే నెలవారి రైల్వేపాసులు రేటు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. డిజిటల్ మోడ్ లో తీసుకున్న జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలపై 10 శాతం ప్రీమియం తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ..పేమెంట్ చేసే జీవన్ బీమాపై 8 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. 4.32 కోట్ల మంది రైతులకు రూపే కార్డులు అందజేస్తామని చెప్పారు. ఆన్ లైన్ లో టోల్ ఫీజు చెల్లిస్తే 10 శాతం రాయితీ  ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

Don't Miss