తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

08:24 - December 1, 2016

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. డిసెంబర్‌ 2న తమిళనాడులోని కడలూరు వద్ద ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపానుకు ' నాదా ' అని నామకరణం చేశారు. ప్రస్తుతం చెన్నైకు ఆగ్నేయంగా 1010 కి.మీల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. 
'నాదా' తుపానుగా నామకరణం 
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు నాదా అని నామకరణం చేశారు. ఈ తుపానుతో దక్షిణ కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలుతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. 
చెన్నైకు ఆగ్నేయంగా 710 కి.మీల దూరంలో కేంద్రీకృతం 
ప్రస్తుతం చెన్నైకు ఆగ్నేయంగా 710 కి.మీలు, పుదుచ్చేరికి 670 కి. మీల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. తుపాను హెచ్చరికలతో దక్షణ కోస్తా లో ఉన్న తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
కేరళను తాకనున్న తుపాను
నాదా తుపాను ప్రభావం కేరళనూ తాకనుంది. తీరం దాటే సమయంలో కేరళలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్‌ 2న పుదుచ్చేరి లేదా కేరళ రాష్ట్రాల మధ్య ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

 

Don't Miss