'త్రివిక్రమ్' కు యాక్షన్ సెగ్మెంట్ కలిసొచ్చేనా ?

15:19 - August 20, 2018

ఓ స్టార్ హీరో.. స్టార్ డైరక్టర్..ఇంత వరకు మనం చూడని క్రేజీ కాంబినేషన్ ఎప్పుడూ తను టచ్ చేయని కొత్త ఎలిమెంట్ ను టచ్ చేశాడు దర్శకుడు. తనకు అలవాటు అయిన సబ్టెక్స్ ను ఇంకా కొత్తగా చూపించడానికి రెడీ అయ్యాడు హీరో.. రీసెంట్ టీజర్ తో అందరికి క్లారిటీ కూడా ఇచ్చారు. యంగ్ టైగర్ 'ఎన్టీఆర్', మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్'.. వీరిద్దరి కాంబినేషన్ లో 'అరవింద సమేత' మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు మందు కొరటాల శివ డైరక్షన్ లో జనతా గ్యారేజ్ లో సాఫ్ట్ గా చెప్పి.. వినకపోతే హార్డ్ వేరు పరితనం చూపించాడు తారక్.. తరువాత కిందటి ఏడాది బాబి దర్శకత్వంలో వచ్చిన 'జై లవకుశ'లోమూడు పాత్రలలో మూడు వేరియేషన్స్ చూపించి అభిమానుల మతిపోగొట్టాడు యంగ్ టైగర్. దాంతో త్వరలో రాబోయే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

త్రివిక్రమ్, తారక్ కలయికలో 'అరవింద సమేత' టైటిల్ తో వస్తున్న మూవీ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకొంటోంది. త్రివిక్రం మొదటిసారిగా యాక్షన్ సెగ్మెంట్ ను టచ్ చేశాడు. జూనియర్ కు ఈ మూవీస్ కొత్త కాకపోయినా.. త్రివిక్రం డైరక్షన్ లో ఈమూవీ సరికొత్తగా ఉండబోతోందంట. టీజర్ లో ఎన్టీఆర్ చాలా కొత్తగా, హ్యాండ్ సమ్ లుక్ తో ఉన్నారు. స్ట్రాంగ్ సీమ డైలాగ్స్ ను న్యూ మాడిలేషన్ తో చెప్పాడు ఎన్టీఆర్. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ 15నిముషాల పాటు సిక్స్ ప్యాక్ ఎక్స్ పోజ్ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. 'టెంపర్' మూవీకి అప్పుడే సిక్స్ ప్యాక్ చేసిన తారక్ ఆ మూవీలో సరిగ్గా ఎక్స్ పోజ్ చేయలేకపోయాడు. ఇక 'అరవింద సమేత'లో యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీకి హైలెట్స్ అవ్వనున్నాయట. ఇక చాలా రోజుల తరువాత ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు , జగపతి బాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి త్రివిక్రమ్ కు ఈ సినిమా కలిసి వస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

Don't Miss