మాంసం తెగ తినేస్తున్నారు..!!

12:34 - September 1, 2018

సండే వచ్చిందంటే చాలు ముక్కలేనిదే ముద్ద దిగన నాన్ వెజ్ ప్రేమికుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఏ విందుకైనా ముక్కతో కూడిన ఆహారం వుండాల్సిందే. అలా మారిపోతోంది నేటి ఆహార వినియోగం పరిస్థితి. తినే కంచంలో చిన్న చికెన్ ముక్క వుంటే చాలా వారం వర్జం పక్కన పెట్టి లొట్టలేసుకుంటు తినేస్తారు. మాంసాహార వంటకాలతో విందు రుచే మారిపోతుంది. ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రపంచంలో మాంసాహార వినియోగం బాగా పెరిగిందని ముక్కమీద ఒట్లేసి చెప్పకతప్పదు.

మాంసాహార ప్రియులు అమెరికన్లు..
93 కేజీల మాంసాహార వినియోగంతో గత మూడేళ్లుగా ఆస్ట్రేలియా ముందుండేది. రోజుకు పావు కేజీ మాంసాన్ని అవలీలగా తినేస్తు అమెరికన్లు ఆస్ట్రేలియా స్థానాన్ని ఆక్రమించారు. అమెరికాలో మాంసం ప్రియులు 97.1 శాతం తినగా..ఆస్ట్రేలియాలో 94.8గా వుంది. ఇక అర్జెంటీనా, ఉదుగ్వే, ఇజ్రాయిల్,బ్రెజిల్, చైనా, కెనాడా, న్యూజిలాండ్ దేశాలు ఇంచుమించు 86, ..85,70,65 శాతానికి ఇంచుమించుగా వున్నాయి.

మాంసాహారంతో ముంచుకొస్తున్న ముప్పు..
పోషకాహారంగా మాంసానికి ప్రాధాన్యం ఉన్నా ప్రపంచంలో మాంసం వినియోగం ఎంత పెరిగితే మన పర్యావరణానికి అంత హాని అని పర్యావరణ వేత్తలంతా హెచ్చరికల్ని కూడా గమనించాల్సిన అవసరముంది. మాంసం కోసం పెద్దఎత్తున పెంచుతున్న పశువుల నుంచి భారీగా మీథేన్‌ వాయువులు వెలువడుతుండటంతో అవి భూమిలో వేడిని పెంచుతున్నాయని నిపుణులు గుర్తించారు. కాగా పశువుల నుండి కంటే కాయగూరల పెంపకం నుంచి వెలువడే మీథేన్‌ వాయువు చాలా తక్కువగా వున్నట్లు కూడా నిపుణులు గుర్తించారు. మాంసం కోసం పెంచుతున్న జంతువులన్నింటినీ చూస్తే పశువులు, గొర్రెలు, మేకల నుంచే మీథేన్‌ వంటి పర్యావరణ హానికర వాయువులు అత్యధికంగా వెలువడుతున్నాయి.

పండ్లు, కూరలు, పప్పు ధాన్యాలతో మేలు..
పొలాల్లో విరివిగా పండించే పండ్లు, కూరలు, పప్పు ధాన్యాల పంటల నుంచి వెలువడే హానికర పదార్ధాలు బహు తక్కువగా వుంటాయట. కాబట్టి పర్యావరణం పచ్చగా మానవ మనుగడ..జీవ పరిణామం సక్రమంగా వుంటుంది. అలా వుండాలంటే మాంసాహారం తగ్గించుకుని పండ్లు, కూరగాయలు, పప్పుల వైపు ఎక్కువుగా వినియోగించటం..అలవాట్లను పెంచుకోవటం శ్రేయస్కరమని శాస్త్రవేత్తలు నొక్కిచెబుతున్నారు.

Don't Miss