నేడు బందరుపోర్టు గ్రామాల్లో పర్యటించనున్న జగన్‌

07:50 - December 1, 2016

కృష్ణా : బందర్‌ పోర్ట్ కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సమీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలకు వైసీపీ అధినేత జగన్ అండగా ఉండేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ మచిలీపట్నం బందర్ పోర్ట్  బాధిత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. భూ స‌మీక‌ర‌ణ‌కు భూములు ఇచ్చేంద‌కు సిద్దంగాలేని బుద్దలపాలెం, కోన గ్రామాల ప్రజ‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. 
బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్‌ కోసం 
కృష్ణా జిల్లాలో బందర్‌ పోర్ట్‌, పారిశ్రామిక కారిడార్ కోసం 33వేల ఎక‌రాల భూమిని స‌మీక‌రించేందుకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కి నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఆయితే లాండ్ పూలింగ్‌కి భూములు ఇచ్చేందుకు బంద‌ర్ పోర్టు పరిస‌ర గ్రామాల ప్రజ‌లు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం భూసమీకరణ చర్యలు చేపట్టడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే రైతులకు అండగా ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ, వామ పక్షాలు బాధిత  ప్రజలు తరుపున పోరాటం చేస్తున్నారు . రైతుల ఆందోళనకు అండగా నిలిచేందుకు ఇవాళ బాధిత గ్రామాల్లో వైఎస జగన్  పర్యటించనున్నారు. పోర్ట్‌ పరిసర గ్రామాలకు వెళ్లి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.జగన్‌ పర్యటన నేపథ్యంలో ఆపార్టీ శ్రేణులు విస్త్రత ఏర్పాట్లు చేశారు. 
బందర్‌ పోర్టు భూసమీకరణను వ్యతిరేకి ప్రజలు 
బందర్‌ పోర్టు భూసమీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. ఓవైపు భూసమీకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా దూకుడు ప్రదర్శించడంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్,.క‌ర ఆగ్రహారంతో పాటు మ‌రికొన్ని గ్రామాల్లో పర్యటించారు. అయితే తాజాగా బుద్దలపాలెం, కోన గ్రామాల్లో జ‌గ‌న్ ప‌ర్యటించనున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్నివిపక్ష పార్టీల నాయకులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. వెయ్యి గజాల ఇంటిస్థలం, 250 గజాల కమర్షియల్ ప్లాట్ కోసం తమ విలువైన భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతలు తెగేసి చెబుతున్నారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అని పార్టీలతో కలిసి బందర్‌ పోర్ట్‌ భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వైసిపి భావిస్తోంది. అన్ని పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వైసిపి వ్యూహరచన చేస్తోంది. 

 

Don't Miss