జన్‌ధన్‌ ఖాతాలో వేసిన బ్లాక్ మనీ పేదలకే : మోదీ

22:06 - December 3, 2016

ఉత్తరప్రదేశ్ : జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనాన్ని విత్‌ డ్రా చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోది ఖాతాదారులకు విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ధనికులు ఇప్పుడు పేదల ఇళ్లముందు క్యూలు కడుతున్నారని తెలిపారు. వాళ్లు మీ ఇంటి చుట్టూ చక్కర్లు కొడతారు. మిమ్మల్ని వేడుకుంటారు. మీ కాళ్ల మీద పడతారు. ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిస్తే.. ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ధైర్యంగా చెప్పండని సూచించారు. జన్‌ధన్‌ ఖాతాలో వేసిన నల్లధనం పేదలకే చెందుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నిర్వహించిన బిజెపి పరివర్తన్‌ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ....పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. భారత ప్రజలే తన అధిష్ఠానమని.... నల్లధనం, అవినీతిపై పోరాడడం ద్వారా తానేమైనా నేరం చేశానా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. నేను మీ కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నాను. ఆ అవినీతిపరులు నన్నేమీ చేయగలరు? నేను ఫకీర్‌ను. జోలె సర్దుకొని ఏ క్షణమైన వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానని మోది పేర్కొన్నారు.

Don't Miss