ఉద్యోగులకు క్యాష్ లెస్ విధానం

07:47 - December 4, 2016

హైదరాబాద్ : సాధ్యమైంత త్వరగా క్యాష్ లెస్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పిలుపునిచ్చారు. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే లావాదేవీలు చెయ్యాల్సి వస్తుందన్న సీఎస్‌..వచ్చే నెల జీతం నగదు రూపంలో అందచేయడం కుదరని స్పష్టం చేశారు. క్యాష్ లెస్ పాలసీని ఉద్యోగులందరూ త్వరగా నేర్చుకోవాలని సీఎస్‌ ప్రదీప్‌చంద్ర సూచించారు. 
క్యాష్ లెస్ విధానంపై అవగాహన కార్యక్రమం
ఉద్యోగులకు క్యాష్ లెస్ విధానంపై సెక్రటేరియట్‌లో ఆర్ధిక శాఖ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ బ్యాకింగ్, క్యాష్ లెస్ విధానంపై ప్రజలు మరింత వేగంగా క్యాష్ లెస్ విధానాన్ని అలవర్చుకోవాలని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. ఉద్యోగులు నెలవారి జీతం,.ఇతర అవసరాలను ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను అమలు చేసుకుంటే పని సులువు అవుతుందన్నారు. 
కేవలం 20 శాతం డబ్బు మాత్రమే విడుదల 
ఇప్పడున్న డబ్బు కేవలం 20 శాతం మాత్రమే విడుదల చేస్తారని మిగతా మనీ మొత్తం క్యాష్ లెస్ విధానమే ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే సిద్ధిపేట నియోజకవర్గంలో క్యాష్ లెస్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర చెప్పారు. ఇక వచ్చే నెల ఉద్యోగులకు నగదు రూపంలో జీతభత్యాలు ఇవ్వడం కుదరని..బ్యాంక్‌ అకౌంట్‌లోనే మొత్తం జీతాన్ని జమచేస్తామని సీఎస్‌ స్పష్టం చేశారు. 
ప్రత్యేక కౌంటర్ల ద్వారా పాలసీ వివరణ 
క్యాష్ లెస్‌ విధానం ద్వారా ఉద్యోగులకు జరిగే ప్రయోజనాలపై వివిధ బ్యాంకు అధికారులు ప్రత్యేకమైన కౌంటర్ల ద్వారా పాలసీని వివరించారు. డిజిటైజేషన్, ఈ కామర్స్, పేటీఎం వంటి విధానాలను ఉద్యోగులకు వివరించారు. పెద్దనోట్ల రద్దుతో ఉద్యోగులు మొదలు అందరూ క్యాష్ లెస్ ట్రాన్ జెక్షన్ పై అవగాహన పెంచుకోవడం వల్ల నోట్ల సమస్య నుంచి బయట పడవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 

 

Don't Miss