మూడో టెస్ట్‌లో కోహ్లీ సెంచరీ

07:55 - August 21, 2018

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో చేజార్చుకున్న సెంచరీని రెండో ఇన్నింగ్స్‌లో సాధించి తన సత్తా సాధించుకున్నాడు. 191 బంతుల్లో 10 ఫోర్లతో టెస్టుల్లో 23వ సెంచరీ సాధించాడు. అనంతరం 103 పరుగుల వద్ద క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్లూ రూపంలో పెవిలియన్‌ బాటపట్టాడు. ఈ సెంచరీతో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 58వ సెంచరీ... 2018లో 6వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో అత్యధిక సెంచరీలు చేసిన టెస్ట్‌ కెప్టెన్ల జాబితాలో కోహ్లీ చేరాడు.  భారత్‌ ఇంగ్లాండ్‌ ముందు 521 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సోమవారం ఆట చివర్లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుక్‌, జెన్సింగ్స్‌ ఉన్నారు.  

 

Don't Miss