సినీ ఫక్కీలో 'ఎర్రచందనం' దుంగల స్వాధీనం...

09:12 - August 30, 2018

 

చిత్తూరు : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు ప్రభుత్వం..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. పలు సందర్భాల్లో పోలీసులపైకి దాడులు చేస్తున్నారు. తాజాగా మరో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు చెక్ పెట్టారు. తిరుపతి - చెన్నై రహదారిపై ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయంగా సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేశారు. కొద్ది కిలో మీటర్ల మేర వెంబడించిన అనంతరం లారీని పట్టుకున్నారు. అందులో ఉన్న 120 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు విషయం తెలియదని ఇద్దరు వ్యక్తులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

Don't Miss