తాప్సీ..టాలీవుడ్ కు టాటా..!

08:55 - December 8, 2016

సొట్టబుగ్గల సుందరి 'తాప్సీ' ఫుల్ హ్యపీ గా ఉంది. ఈ బ్యూటీకి టాలీవుడ్ కలిసి రాలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే వర్కవుట్ అవుతుంది. చూస్తుంటే ఈ హీరోయిన్ ఇక బాలీవుడ్ లో సెట్ అయినట్లే కనిపిస్తుంది. 'తాప్సీ' చాలా ఆనందంగా వున్నానంటోంది. కారణం బాలీవుడ్‌లో తన కెరీర్‌ మంచి జోరు మీదుంటుండడమేనట. బీటౌన్ లో ఈ ఎడాది 'తాప్సీ' నటించిన 'పింక్‌' సూపర్ హిట్టు అయింది. అంతేకాదు ఈ సినిమా అవార్డుల మీద అవార్డుల్ని సొంతం చేసుకుంటోంది. 'పింక్' సినిమా ప్రమోషన్‌ బాధ్యతల్ని భుజాన వేసుకున్న ఈ బ్యూటీకి ఈ మూవీ విజయం సాధించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

నామ్ షబానా..
'తాప్సీ' బాలీవుడ్ లో ప్రస్తుతం 'నామ్‌ షబానా' సినిమా చేస్తుంది. ఈ మూవీ తన కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్‌ అంటూ ఈ బ్యూటీ పొంగిపోతోంది. ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో 'ఘాజీ’, 'తడ్కా', 'జూడ్వా' మూవీస్ చేస్తోంది. 'తాప్సీ' అంటే మన టాలీవుడ్‌ ఆడియన్స్ కి కేవలం గ్లామర్‌ డాల్‌ మాత్రమే కానీ బాలీవుడ్‌లో మాత్రం 'తాప్సీ' డిఫరెంట్ క్యారెక్టర్స్ తో నటిగా పేరు తెచ్చుకొంటోంది. చూస్తుంటే 'తాప్సీ' సౌత్ కి టాటా చెప్పేసినట్లు టాక్. 'గుండెల్లో గోదారి' మూవీ తరువాత ఈ బ్యూటీ తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. దీంతో 'తాప్సీ' బాలీవుడ్ పైనే టోటల్ ఫోకస్ పెట్టింది. లక్ బాగుండి బాలీవుడ్ లో ఈ చిన్నది చేస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి. బాలీవుడ్‌కి వెళ్ళాక సినిమా గురించి చాలా నేర్చుకున్నాననీ, సినిమాకు సంబంధించి విభాగాలపైనా అవగాహన పెంచుకున్నానని మురిసిపోతోంది. మొత్తానికి 'తాప్సీ'కి బాలీవుడ్ నీళ్లు బాగానే పడ్డాయనే చెప్పాలి.

Don't Miss