చెమట చుక్కతో ఆరోగ్యం..

13:00 - December 8, 2016

చెమట చుక్కతో ఆర్యోగం ఎలా తెలుస్తుంది. ప్రస్తుతం సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందో తెలిసిందే. రోజుకో పరికరం మార్కెట్ లో లభ్యమౌతున్నాయి. అందులో ఆరోగ్యం గురించి ఎన్నో వస్తువులు దొరుకుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన పలు యాప్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నార్త్ వెస్టర్న్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ స్టిక్కర్ ను తయారు చేశారు. చెమట చుక్కతో ఈ స్టిక్కర్ ఆరోగ్యాన్ని తెలియచేస్తుందంట. నాలుగు భాగాలుగా ఉండే ఈ స్టిక్కర్ లో నాలుగు రకాల రసాయనాలు ఉంటాయి. శరీరంలో నుండి వెలువడే చెమటతో కలిసినప్పుడు ప్రతిచర్య కలిగి వాటి రంగు మారుతుంది. తమ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తో ఇలా రంగు మారిన స్టిక్కర్ ను ఫొటో తీస్తే ఫోన్లో వాటికి సంబంధించిన యాప్, రంగులను బట్టి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయవచ్చంట. ఆమ్లశాతం, లాక్టేట్‌ పరిమితులు, క్లోరైడ్‌ నిల్వలు, గ్లూకోజ్ స్థాయిలను ఇవి పసిగడుతాయి. ఈ స్టిక్కర్ అన్ని సందర్భాల్లో పనిచేస్తుందా ? లేదా ? అని టెస్ట్ కూడా చేశారని తెలుస్తోంది. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇది శుభ్రంగా పనిచేస్తున్నట్లు తేలింది. తక్కువ ఖరీదులో ఈ స్టిక్కర్స్ దొరుకుతాయంట. 

Don't Miss