ఆసుపత్రి నుండే మంత్రి సుష్మా విధుల నిర్వహణ..

17:12 - December 3, 2016

ఢిల్లీ : అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తన విధులకు మాత్రం ఆటంకం కలిగించడం లేదు. విదేశాంగ శాఖకు చెందిన పనులను ఆమె ఎయిమ్స్‌ నుంచే నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన ఫైళ్లకు అనుమతిస్తూ ఆసుపత్రి నుంచే చర్చలు జరుపుతున్నారు. కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న సుష్మా స్వరాజ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో అమృత్‌సర్‌లో జరుగుతున్న హార్ట్‌ ఆఫ్‌ ఏషియా సమ్మేళనానికి మంత్రి హాజరు కాలేకపోయారు. దీంతో ఇద్దరు విదేశాంగ సహాయ మంత్రులు ఎంజె అక్బర్‌, వికె సింగ్‌ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశానికి 40 దేశాల విదేశాంగ మంత్రులతో పాటు పెద్ద ఎత్తున అధికారులు పాల్గొంటున్నారు. 

Don't Miss