కన్ను కొట్టిన ప్రియావారియర్‌..కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు..

15:44 - August 31, 2018

కేరళ : మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై ఉన్న కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆమె నటించిన 'ఒరు అదార్‌ లవ్' చిత్రంలో ముస్లిం భావాలను కించపరిచేలా పాట ఉందన్న ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పాటలో ప్రియ కన్నుకొట్టిన సన్నివేశాలు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నాలుగు నెలల తర్వాత ప్రియపై వేసిన కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 'ఎవరో సినిమాలో ఏదో పాట పాడితే మీకు కేసు వేయడం తప్ప మరో పని లేదా?' అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Don't Miss