'నోట్లరద్దు'పై సుప్రీంలో విచారణ..

07:57 - December 3, 2016

ఢిల్లీ : నోట్ల రద్దుతో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలను వీలైనంత త్వరగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ప్రజల ఉపశమనానికి తీసుకున్న చర్యలను కేంద్రం బహిర్గతపరచాలని సుప్రీం సూచించింది. 
పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ 
పెద్ద నోట్ల రద్దుతో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వ్యాఖ్యానించింది. సహకార బ్యాంకులపై ఆధారపడిన గ్రామీణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 
సహకార బ్యాంకులకు సరిపడా నగదు పంపాలని సూచన
కో...ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోవైపు ఖాతాదారులకు నగదు అందించలేకపోతున్నామని కోర్టుకు మహారాష్ట్ర, కేరళ సహకార బ్యాంకులు తెలిపాయి. మహారాష్ట్ర, కేరళ సహకార బ్యాంకుల సమస్యలు నిజమైనవేనని ధర్మాసనం అంగీకరించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సమస్య ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నోట్ల సమస్యలపై పరిష్కార మార్గాలు చూపాలని కేంద్రానికి  సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Don't Miss