చినుకులు..మహిళలకు చిట్కాలు..

15:43 - July 6, 2017

వేసవికాలం వెళ్లిపోయింది..వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షకాలంలోనే అత్యధికంగా అనారోగ్యాలు వ్యాపిస్తుంటాయి. అనారోగ్యం బారిన పడగానే వైద్యుల దగ్గరకు పరిగెడుతుంటుంటారు. అంతేగాకుండా బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో పలు ఇబ్బందులు పడుతుంటారు. వర్షంలో దుస్తులు తడవడం..షూలు తడిసిపోవడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కొన్ని సమస్యల నుండి దూరమయ్యే అవకాశం ఉంది.
యువతులకు ఈ కాలంలో దుప్పట్టాలు అంతగా సూట్ కావు. షార్ట్ కుర్తీలు..లెగ్గిన్స్..చుడిదార్ వేసుకుంటే బెటర్.
దుస్తులు తడిసినా త్వరగా ఆరిపోవాలంటే చిఫాన్..సిల్క్..ఫ్రాబిక్ కాటన్ దుస్తులు ధరిస్తే బాగుంటుంది.
వర్షాకాలంలో తడవగానే కొంత డల్ గా..నీరసంగా కనిపిస్తుంటారు. అందుకని డార్క్ కలర్ లో ఉండే లెగ్గిన్స్..చుడీదార్స్ వేసుకొని చూడండి.
జీన్స్, లాంగ్ స్కర్ట్స్, అధిక మెటీరియల్‌తో కుట్టిన డ్రెస్స్‌లు ఈ కాలంలో ఇబ్బందిగా ఉంటాయి.
పసుపు, ఆరెంజ్, బ్లూ మిక్స్ చేసిన రంగులు, ఎరుపు, పింక్, దుస్తులను ధరించి తేడా ఏంటో చూడండి.
వర్షాకాలంలో బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెయిన్ కోట్ జాకెట్స్..గొడుగులు..జెల్లీ షూ వంటివి చక్కగా ఉపయోగపడుతాయి.

Don't Miss