రూపాయి.. పతనమైంది...

21:29 - August 15, 2018

రూపాయి.. పతనమైంది... నిజమే.. అయితే.. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వస్తుంది..? అసలు ఈ పతనం ఎవరికైనా మేలు చేస్తుందా..? వాచ్‌ దిస్‌ స్టోరీ.. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన.. దేశీయ రూపాయి విలువ దారుణంగా పతనమైపోయింది. ఇన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో డాలర్‌తో మారకం విలువ 70 రూపాయల 09 పైసల స్థాయికి పడిపోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ కోణాన్ని పక్కనుంచితే.. రూపాయి పతనం కావడం.. భారతీయులపై ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది అన్నది ప్రశ్న.
మొదటగా దిగుమతులపైనే ప్రభావం  
రూపాయి విలువ పడిపోయిందంటే.. ఎప్పుడైనా ఫస్ట్‌గా దాని ప్రభావం పడేది దిగుమతులపైనే. దేశీయ దిగుమతుల్లో సింహభాగం.. క్రూడాయిల్‌ ఉంటోంది. అంటే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇక కొండెక్కే అవకాశం ఉంది. అదే జరిగితే.. సరకుల రవాణా ఖర్చు పెరిగి ఆమొత్తాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుందన్నమాట. దిగుమతి చేసుకుంటున్న యంత్రసామగ్రి, ల్యాప్‌టాప్‌ లాంటి వస్తువుల ధరలూ బాగా పెరుగుతాయి. విదేశీ విద్యకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు భారం తడిసి మోపెడు కానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులూ వెనక్కి వెళ్లొచ్చు. 
రూపాయి పతనం.. కొందరికి మేలు 
రూపాయి ఇలా పతనం కావడం.. కొందరికి మాత్రం మేలు చేయబోతోంది. మన దేశం నుంచి ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే వారు బాగా లాభపడతారు. అంతేకాదు.. విదేశాల్లోని తమ పిల్ల నుంచి డబ్బులు పొందే తల్లిదండ్రులకూ లాభమే. మారకం విలువ ప్రకారం అక్కడి వారు  ఓ వెయ్యి డాలర్లు పంపితే గతంలో.. ఓ 65 నుంచి 66 వేలు వచ్చేవి. ఇప్పుడు.. 70వేల వరకూ వస్తుంది. మొత్తానికి డాలర్‌తో రూపాయి విలువ పతనం కావడం.. దేశంలో ఆర్థిక మాంద్యానికీ కారణం కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

Don't Miss