విప్లవ'నాయకి'అవార్డుల పట్టపురాణి..

10:28 - December 6, 2016

తమిళనాడు : ఎన్నో సంచనాలకు మారు పేరైన తమిళనాడు సీఎం జయలలిత శకం ముగసింది. జయలలిత అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలుకా మేలుకోటేలో 1948 ఫిబ్రవరి 24న జన్మించారు. జయలలిత తల్లి పేరు వేదవల్లి . జయలలితకు ఆమె తల్లిదండ్రులు కోమలవల్లిగా నామకరణం చేశారు. 1981లో జయ రాజకీయాల్లోకి వచ్చారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా జయ పనిచేశారు. 1991లో ఎన్నికల్లో విజయం సాధించి తొలి మహిళా సీఎంగా జయ రికార్డును నెలకొల్పారు. 2006లో మళ్లీ ఆమె సీఎం పదవి చేపట్టారు. 15వ ఏట సినీ పరిశ్రమలోకి జయ అడుగుపెట్టారు. హీరోయిన్‌గా ఆమె తొలిచిత్రం 'చిన్నడగొంబె' కన్నడ సినిమా, మనుషులు-మమతలుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారాన్ని ఇచ్చి జయలలితను గౌరవించింది.

మనుషులు-మమతలుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం
1972లో జయకు కలైమామణి పురస్కారంతో సత్కరించన తమిళనాడు ప్రభుత్వం ..తమిళుల గుండెల్లో అమ్మగా చిరస్థాయిగా నిలిచిపోవడానికి జయ చేసిన పోరాటం అసాధారణమైనది. పురుషాధిక్య రాజకీయాలను, . కరడుగట్టిన ద్రవిడ రాజకీయాలను సవాలు చేసి తనకంటూ సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారు జయలలిత. కేసులు.. అరెస్టులు.. జైళ్లు.. అనర్హత వేట్లు ఇవన్నీ ఆమె మొక్కవోని ధైర్యం ముందు తలవంచాయి. సడలని సంకల్పం ముళ్లబాటను పూలబాటగా మార్చింది. జనం గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకుంది.

ముగిసిన జయ శకం
ఓ శకం ముగిసింది. పడిలేచిన కెరటం నింగికెగిసింది. వెళ్తూ వెళ్తూ అమ్మా అన్న ఆప్యాయతను గుండెలనిండా నింపుకొని, అభిమానులను అనాథలను చేసి వెళ్లిపోయింది. తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో యావత్‌ తమిళ రాష్ట్రం దిగ్భ్రాంతికి గురైంది. జ్వరం, డీ హైడ్రేషన్‌ కారణంగా సెప్టెంబర్‌22న అపోలో ఆసుపత్రిలో చేరిన జయ.. గడచిన 75 రోజులుగా మృత్యువుతో పోరాడారు. అమ్మ కోలుకున్నారని.. ఏ క్షణంలోనైనా ఇంటికి తిరిగొస్తారని ఎదురు చూస్తున్న అన్నాడిఎంకే శ్రేణులకు అమ్మ లేరన్న వార్త పిడుగుపాటే అయింది. తమిళనాడు వీధివీధినా.. అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం కార్యకర్తలు, జయలలిత అభిమానుల రోదనలు మిన్నంటుతున్నాయి. జయ ఆరోగ్యం కుదుటపడిందని.. ఏ క్షణంలోనైనా ఆమె ఇంటికి వెళ్లొచ్చంటూ వైద్యులు చేసిన ప్రకటనలు.. అంతలోనే కల్లలయ్యాయి. తమిళప్రజలను కన్నీటి సంద్రంలో ముంచి అమ్మ మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు.

Don't Miss