పురిచ్చితలైవికి ప్రీతికరమైనవేంటో తెలుసా..

13:38 - December 6, 2016

తమిళనాడు : చాలా కాలం పాటు ఇటు సినిమాల ద్వారా, అటు రాజకీయాల ద్వారా ప్రజా జీవితానికి దగ్గరగా గడిపిన జయలలిత గురించి ఎవరికీ తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. తమిళ సినిమాల్లో గొప్ప తారగా వెలిగిపోయారు కాని.. చిన్నతనంలో భారత మాజీ క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ అంటే ఆమెకు చాలా ఇష్టం అని చెప్పేవారు. ఆయన్ను చూడటానికే కొన్ని టెస్టు మ్యాచ్‌లకు కూడా జయ వెళ్లారు. బాలీవుడ్‌లో అలనాటి స్టైలిష్ హీరో షమ్మి కపూర్ అన్నా కూడా తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో జయ తెలిపారు. షమ్మీకపూర్‌ నటించిన జంగ్లీ సినిమాలోని 'చాహే కోయీ ముఝే జంగ్లీ కహే' పాట అంటే తనకు చాల ఇష్టమని చెప్పేవారు. తెలుగు  సినిమాలలో గయ్యాళి ప్రాతలకు పెట్టింది పేరుగా వున్న నటి సూర్యాకాంతం  చేత్తో చేసిన పులిహోర అంటే తనకు చాలా ఇష్టమని ఓ సందర్భంగా ఆమె తెలిపారు.  కాగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమె ఇటు రాజకీయాల్లోనూ..అటు సినిమా చరిత్రలోనూ తనదైన ముద్ర వేసుకుంది. ఇవే కాకుండా విద్య..నృత్యం..గానం వంటి పలు అంశాల్లో తనకు తానే సాటిగా నిలబడింది..తన ప్రజ్ఞాపాఠవాలను ప్రదర్శించారు పురుచ్చితలైవి..

Don't Miss