విజయవాడ 'బజార్ బేజార్'..

11:45 - December 8, 2016

విజయవాడ : నోట్లు రద్దు ప్రకటన జరిగి నేటి సరిగ్గా నెల రోజులు గడిచాయి. అప్పుడు ప్రారంభమైన నగదు కష్టాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. విజయవాడలో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతూ..నిత్యం రద్దీగా వుండే వన్ టౌన్ ప్రాంతం కొనుగోలుదారులు లేక వెలవెలబోతోంది. పాత పెద్దనోట్ల రద్దుతో ఈ ప్రాంత వాణిజ్యం కుదేలైపోయింది. చిల్లర కష్టాలతో గిరాకీలు లేక ఇటు వ్యాపారులు..అటు కూలీలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. వ్యాపార సంస్థలు బోసిపోయి కనిపిస్తున్నాయి. 90 శాతం వ్యాపారం పడిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. పనులు దొరక్క కూలీల కుటుంబాలు అల్లాడుతున్నాయి. అద్దెలు కట్టలేక..కరెంట్ బిల్లులకు రోజు వారీ నిత్యావసరాలకు కటకటలాడిపోతున్నారు. ఈ సంక్షోభం ఏనాటికి తీరేనో అని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొన్నాయి.

Don't Miss