చెన్నూరు సెంటిమెంట్..ఎవరిది పట్టు?...

15:27 - July 26, 2018

ఆదిలాబాద్ : ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ నియోజకవర్గ ప్రజలు తమదైన శైలీలో తీర్పునిస్తారు. గోడదూకే నేతల కంటే పార్టీలను నమ్ముకున్న అభ్యర్థులనే అక్కడి ప్రజలు అసెంబ్లీకి పంపుతారు. అయితే ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ ప్రభావం తగ్గటంతో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లు ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏమిటి? అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏమిటి? వాచ్ దిస్‌ స్టోరీ.

చెన్నూరుపై ఆధిపత్యం కోసం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పోటాపోటీ
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చెన్నూరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక ఉంది. ఏ నేతలైతే పార్టీని నమ్ముకుని ఉంటారో వారిని అక్కడి ప్రజలు అసెంబ్లీకి పంపుతారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోటగా ఉన్న చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పడు టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చెన్నూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ ఆధీనంలో ఉన్న ఈ నియోజవర్గంలో కాంగ్రెస్‌ తన జెండా ఎగరవేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అందుకనుగుణంగా ఎన్నికల వాతావరణాన్ని సృష్టించారు నేతలు. అధికార పార్టీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుపై ఆరోపణలకు దిగుతూ రాజకీయాల్లో హిట్‌ పెంచుతున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత బోడ జనార్దన్‌. తనకు ఒక్క అవకాశం ఇవ్వడంటూ నియోజకవర్గ ఓటర్లు కోరుతున్నారు.

చెన్నూరు అభివృద్ధిలో విఫలమైనట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఓదెలు
మరోవైపు తెలంగాణ సెంట్‌మెంట్‌ నియోజకవర్గ రాజకీయాలను మార్చటంతో టీఆర్‌ఎస్‌ నేత నల్లాల ఓదెలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దౌడ్‌పెట్టిస్తానన్న ఎమ్మెల్యే అందులో విఫలమయ్యినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వినోద్‌. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన వినోద్‌ ఇప్పడు టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఓదెలుకు టికెట్‌ ఇస్తే వినోద్‌, వినద్‌కు టికెట్‌ ఇస్తే ఓదెలు అధిష్టానంపై తిరగబడే అవకాశం లేకపోలేదు. టీఆర్‌ఎస్‌ టికెట్ల పంచాయితీ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే చెన్నూరు ప్రజలు ఇటు టీఆర్‌ఎస్‌ను అభ్యర్థిని ఎన్నుకుంటారా లేక అటు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎన్నుకుంటార అనే వేచిచూడాల్సి ఉంది. 

Don't Miss