కేసీఆర్ దూకుడు ముందస్తుకేనా?..

07:45 - August 14, 2018

తెలంగాణాలో అధికార పార్టీ అడుగులు ఎన్నికల వైపు పడుతున్నాయా? అనే సంకేతాలను సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లుగా సంకేతాలిస్తున్నారు. ఆర్నెళ్లు ముందుగా జరిగేవి ముందుస్తు ఎన్నికలు కాదన్నారు. కేంద్రం ముందు ఉంచాల్సిన డిమాండ్లను మరోసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 9 తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చేశారు. సెప్టెంబర్‌ 2న ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో 20 లక్షలమందితో.. ప్రగతి నివేదన పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లలో ఏం చేసిందీ అక్కడే చెబుతామన్నారు. పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు సైతం సెప్టెంబర్‌లోనే ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి కట్టబెడుతూ సమావేశం నిర్ణయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కుతుందంటూ మరోసారి భరోసా కల్పించే యత్నం చేశారు కేసీఆర్. దీన్ని బట్టి చూస్తే గులాబీ బాస్ ముందస్తు ఎన్నికలకు సంకేతమిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇదే అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చ, ఈ చర్చలో కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి, టీఆర్ఎస్ నేత రాజమోహన్, బీజేపీ నేత కుమార్, నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్ వీరయ్య పాల్గొన్నారు. 

Don't Miss