ఇచ్చిన మాట నిలుపుకోకపోతే ఆత్మహత్యే..

17:21 - September 8, 2018

హైదరాబాద్ : వందలాది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తెలంగాణ చరిత్రలో నిలిచిపోయాడు. ఈ క్రమంలో పలు పరిణామాల నేపథ్యంలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల్లో శంకరమ్మ టికెట్ పై మరోసారి వార్తల్లోకి వచ్చారు. తనను కాదని టీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ టికెట్ ను మరొకరికి ఇస్తే... 10 నిమిషాల్లోనే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తనకు టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు హామీ ఇచ్చారని... ఇచ్చిన మాటను నిలుపుకుంటారని తాను ఆశిస్తున్నానని అన్నారు. మరోవైపు శంకరమ్మకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీరాంజనేయులు, నాగు అనే ఇద్దరు యువకులు హైదరాబాదులోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కి నిన్న హల్ చల్ చేశారు.

Don't Miss