భోళా శంకరుడు 'హరికృష్ణ'...

09:23 - August 29, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, ప్రొడ్యూసర్, టిడిపి రాజకీయ నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం చెందడం పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఆయన కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాల పాలైన హరికృష్ణ నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రికి బయలుదేరారు.

ఇదిలా ఉంటే ఆయన జీవిత గమనాన్ని నేతలు నెమరు వేసుకుంటున్నారు. ఎన్టీరామారావుతో ఎంతో సానిహిత్యంగా ఉండేవాడని, ఆయన ప్రారంభించిన చైతన్య రథానికి డ్రైవర్ గా హరికృష్ణ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన నిర్వహించిన పాత్ర ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు. హరికృష్ణ ఒక మొండి మనిషి..భోళాశంకరుడని టిడిపి నేతలు అభివర్ణిస్తుంటారు. సీతయ్య ఎవరి మాట వినడనే రీతిలో వ్యవహరించేవాడని...ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజీనామా చేసి తెలుగులో ప్రసంగించిన సంగతి తెలిసిందే.

2004లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న జూ.ఎన్టీఆర్ ప్రమాదానికి గురై తృటిలో మృత్యువాత నుండి బయటపడ్డారు. కానీ జానకీ రామ్ మాత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇప్పుడు నందమూరి హరికృష్ణ మృతి చెందడం కుటుంబసభ్యులను కలిచివేస్తోంది. 

Don't Miss