'సమంత' మళ్లీ వచ్చేస్తోంది…

11:12 - December 8, 2016

సమంత..మళ్లీ తెలుగులో కనిపించదా..వివాహం చేసుకున్న అనంతరం 'సమంత' సినిమాల్లో నటించదని పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'..'సమంత' వివాహం త్వరలో జరుగుతుందని వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే వివాహం అనంతరం 'సమంత' మళ్లీ నటించదని టాక్. ఈ ఏడాది 'సమంత'కు మంచి హిట్స్ వచ్చాయి. 'బ్రహ్మోత్సవం' నిరాశపరచగా 'అ..ఆ'..'జనతా గ్యారేజ్' చిత్రాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. అనంతరం 'సమంత' కొత్త ప్రాజెక్టులు ప్రకటించలేదు. 'అక్కినేని నాగచైతన్య'తో పెళ్లి కుదరడం వల్లనే ఆమె కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోవడం లేదని టాక్స్ వినిపించాయి. మంచి ఆఫర్స్ రాకపోవడంతోనే కొత్త సినిమాలకు సైన్ చేయలేదని… దానికి పెళ్లికి సంబంధంలేదని 'సమంత' స్పష్టం చేసింది. తాజాగా 'సమంత' ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశాయి. తెలుగులో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ దొరికాయని… వాటిని ప్రకటించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ట్విట్టర్ ద్వారా 'సమంత' చెప్పేసింది. ఆ ప్రాజెక్ట్స్ ఏంటో మాత్రం చెప్పలేదు. ఏ దర్శకుడు..ఏ హీరోతో 'సమంత' నటించనుందో కొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది. 

Don't Miss