లండన్ లో రేడియోలు అమ్ముతున్న 'సచిన్ కొడుకు'..

12:49 - August 16, 2018

సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెటర్ దిగ్గజాల్లో ఒకరు. కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ లో అడుగు పెట్టి సెంచరీల రారాజుగా పేరు తెచ్చుకుని మాస్టర్ బ్లాస్టర్ గా పేరొందాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ లో రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ లో 18 సంవత్సరాల అర్జున్ టెండూల్కర్ హల్ చల్ చేశాడు. ఎంసీసీ యంగ్ క్రికెటర్స్ శిక్షణలో భాగంగా లండన్ కు వచ్చిన అర్జున్ శుక్రవారం లార్డ్స్ ముందు పాకెట్ రేడియోలు అమ్మే అబ్బాయిగా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో అర్జున్ తో ఫోటో తీయించుకున్న ఈ ఫొటోలను టర్బొనేటర్ హర్బజన్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

తన ట్విట్టర్ ఖాతాలో ‘క్రికెట్ కు పుట్టినిల్లు అయిన లార్డ్స్ లో రేడియోను ఎవరు అమ్ముతున్నారో చూడండి . ఇప్పటికే 50 రేడియోలను అమ్మేశాం. ఇంకొన్ని మాత్రమే మిగిలాయి. జూనియర్ సచిన్. గుడ్ బాయ్‘ అని బజ్జీ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

Don't Miss