లేడీస్...జీన్స్, స్లీవ్ లెస్ వేసుకోవద్దంట..

12:03 - December 8, 2016

ముంబై : కాలేజీ విద్యార్థినిలు అలాంటి డ్రెస్ వేసుకోవద్దు..అలా రావద్దూ అంటూ పలు కాలేజీలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గతంలో విద్యార్థినిలు నిరసనలు తెలియచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో కొన్ని కాలేజీలు విద్యార్థినిలు ధరించే డ్రెస్ లపై ఆంక్షలు విధించడం సంచలనం సృష్టిస్తోంది. సెయింట్ జేవియర్ కాలేజీ, విల్సన్ కాలేజీలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కాలేజీల యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాలపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కత్తిరింపులున్న జీన్స్ వేసుకరావద్దని..స్లీవ్ లెస్ క్లాత్స్..షార్ట్స్ వేసుకుని అమ్మాయిలు కాలేజీ క్యాంపస్ లోకి రావద్దని హుకుం జారీ చేశాయి. ఈ నిబంధన అబ్బాయిలకు కూడా వర్తింప చేశారు. ఇందుకు సంబంధించిన నోటీసులను కాలేజీ ఎంట్రెన్స్ వద్ద అతికించారు. కత్తిరింపులున్న జీన్స్ వేసుకుని సెయింట్ జేవియర్ కాలేజీకి వెళ్లిన ఓ విద్యార్థిని గేటు వద్దే సెక్యూర్టీ అడ్డుకున్నారు. మరొక సంగతి...కొన్ని కాలేజీల్లో విద్యార్థినిలకు సమయం కూడా విధించడం గమనార్హం. రాత్రి ఏడు దాటిన తరువాత కాలేజీ క్యాంపస్ లో ఉండకూడదని నిబంధనలు పెట్టారు. కాలేజీ యాజామాన్యాలు తీసుకున్న ఈ నిబంధనలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాలి. 

Don't Miss