రాజ్యసభలో టీఎంసీ నిరసన..

12:17 - December 2, 2016

ఢిల్లీ : ప.బెంగాల్ లో ఆర్మీ మోహరింపు అంశం రాజ్యసభను కుదిపేసింది. ఆర్మీ బలగాల మోహరింపుపై ఉభయసభల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఆర్మీ మోహరింపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఆర్మీని ఎలా మోహరిస్తారని విపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఆర్మీ బలగాల మోహరింపుపై టీఎంసీ నిరసన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్మీని ఎలా పంపిస్తారని నిలదీశారు. సైనికుల తనిఖీలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇది సాధారణ మాక్ డ్రిల్ అని కేంద్రప్రభుత్వం చెప్పింది. భారత్ బంద్ సందర్భంగా గత నెల 28న కూడా ఆర్మీని పంపామని తెలిపారు. ఆర్మీని పంపాలని కోల్ కతా, హౌరా కలెక్టర్లు లేఖలు రాశారని పేర్కొన్నారు. అధికార, విపక్షాలు వాగ్వాదానికి దిగాయి. సభల్లో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత వారించినా ఇరు పక్షాల సభ్యులు వినపించుకోలేదు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం  2.30 గంటలకు వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss