రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ మూడోసారి

11:48 - December 3, 2016

యంగ్ కాంబినేషన్ రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ ముచ్చటగా మూడోసారి జోడి కట్టుతుంది. ఇప్పటికే రెండు సక్సెస్ లు అందుకున్న ఈ జోడి మరో సక్సెస్ కి రెడీ అవుతున్నారు. లేటేస్ట్ ఈ కుర్రజోడి నటిస్తున్న న్యూ మూవీ విశేషాలను చూద్దాం..
రాజ్ తరుణ్, హేభా పటేల్ సక్సెస్ ఫుల్ జోడీ
రాజ్ తరుణ్, హేభా పటేల్ సక్సెస్ ఫుల్ జోడీ అనే విషయం రెండు సార్లు ప్రూవ్ అయింది. ఫస్ట్ టైం కుమారి 21ఎఫ్ కోసం జతకట్టి బ్లాక్ బస్టర్ కొట్టారు. కూమారి సక్సెస్ తో యంగ్ స్టర్స్ ఫేట్ మారిపోయింది. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకంలో కలిసి ఈ జోడి మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరో సక్సెస్ కోసం ఈ యంగ్ కాంబినేషన్ రెడీ అయింది. 
ఈ జోడికి మంచి క్రేజ్
బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ ల జోడి మంచి క్రేజ్ వచ్చేసింది. ఈ హిట్టు పెయిర్ మళ్లీ సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు అందగాడు మూవీ కోసం హెబ్బాపటేల్ మూడోసారి రాజ్ తరుణ్ తో స్క్రీన్ రోమాన్స్ కి రెడీ అయింది.
శరవేగంగా అందగాడు షూటింగ్ 
అందగాడు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సక్సెస్ పుల్ రైటర్ గా పేరుతెచ్చుకున్న వెలిగొండ శ్రీనివాస్ ఈ మూవీ తో దర్శకుడిగానూ అరంగేట్రం చేయనున్నాడు. ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. అందగాడు సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

 

Don't Miss