ప్రధాని మోదీపై రాహుల్ మాటల దాడి..

15:45 - December 2, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదిపై మరోసారి మాటల దాడి చేసారు. సోనియా అస్వస్థత కారణంగా తొలిసారిగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రాహుల్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ప్రధాని టిఆర్‌పి రాజకీయాలు కొత్త సంక్షోభానికి దారి తీస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రధానమంత్రులెవరూ టిఆర్‌పి ఆధారంగా పరిపాలన సాగించలేదన్నారు. పాకిస్తాన్‌ విషయంలో ప్రధాని పూర్తిగా విఫలమయ్యారని, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల విచిత్రమైన పరిస్థితి నెలకొందని రాహుల్‌ ఆరోపించారు. భారత్‌లో నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, చలామణిలో ఉన్న నగదంతా నల్లధనం కాదన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Don't Miss