దేశంలో మహిళలకు రక్షణ కరువైంది : రాహుల్

15:21 - July 20, 2018

ఢిల్లీ : దేశంలో మోడీ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. హిందూస్తాన్ మహిళలకు రక్షణ లేదని ఎకనామిక్ టైమ్స్ లో ఆర్టికల్ వచ్చిందన్నారు. వాయిదా అనంతరం లోక్ సభ ప్రారంభం అయింది. రాహెల్ ఆరోపణలతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మోడీ ఒత్తిడితో మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రపంచమంతా పెట్రోల్ ధరలు తగ్గుతుంటే.. మన దగ్గర పైపైకి పోతున్నాయన్నారు. 
మోడీ హృదయంలో రైతులు, పేదలకు స్థానం లేదు.. 
మోడీ హృదయంలో రైతులు, పేదలకు స్థానం లేదని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు మోడీ రెండున్నర లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని చెప్పారు. రూ.2.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేయించారని తెలిపారు. కానీ రైతుల రుణమాఫీని మాత్రం ప్రధాని పట్టించుకోరని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల కోసమే పని చేస్తోందని విమర్శించారు. ఏ ఎజెండా లేకుండా చైనాలో మోడీ రహస్యంగా పర్యటించడం వెనుక మతలబు ఏంటీ ? ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడితో పచార్లు చేస్తుంటే..1000 మంది చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారని తెలిపారు. చైనా అధ్యక్షుడు వెళ్లిపోగానే డోక్లాంలో చైనా సైనికులు తిష్ట వేస్తారని చెప్పారు. నిజాలను విని భయపడకండి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ తెస్తే బీజేపీ వ్యతిరేకించిందని గుర్తు తెచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నారు. 

 

Don't Miss