మోడీ..కేసీఆర్..హామీలేమయ్యాయి ? - రాహుల్...

17:22 - August 13, 2018

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.మహిళా సంఘాల గ్రూపులకు బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తుందని...సరిగ్గా రుణాలు అందిస్తే వ్యాపారం..ఉద్యోగాలు చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం, ఎన్డీయే సర్కార్...బ్యాంకుల్లో ఉన్న డబ్బులు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు మాత్రమే లోన్లు మాత్రమే ఇవ్వడానికి అనుమతినిస్తోందన్నారు.

చిన్న వ్యాపారులు, రైతులు, మహిళా సంఘాలు రుణాలు కావాలని కోరితే వీరికి రుణాలు ఇవ్వద్దని చెబుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకు రుణాలు అందించేందుకు కృషి చేస్తామని, నేరుగా అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర ఎక్కువ చేస్తామని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారని, దేశం మొత్తంలో రూ. 10వేల కోట్ల రూపాయలు పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయా పర్యటనల్లో మోడీ వెల్లడించారన్నారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూ. 30వేల కోట్ల రూపాయల రుణం మాఫీ చేసిందని, మోడీ చెప్పిన దానికంటే మూడొంతుల అధికంగా ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ చేసిందని తెలిపారు.

నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు చేసిందని..ఈ విషయం అందరికీ తెలిసిందేన్నారు. బ్యాంకుల్లో ఎంతో మంది క్యూ లైన్ లో వేచి ఉన్నారని..ఈ క్యూ లైన్ లో ఒక్క ధనవంతుడు నిలబడ్డాడా ? అని నిలదీశారు. వారి దగ్గర డబ్బులు లేవా ? వారు ఎందుకు క్యూ లైన్ లో ఎందుకు నిలబడలేదు ?..క్యూ లైన్ లో పేద వారు మాత్రమే ఎందుకు నిలబడ్డారని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద ఉన్న అవినీతి వ్యక్తులు బ్యాంకుల వెనుక ద్వారం నుండి వెళ్లి మొత్తం డబ్బులు వేశారని తెలిపారు. బ్యాంకుల్లో 12 లక్షల కోట్ల రూపాయలు నాన్ ఫెర్మామింగ్ ఉన్నాయన్నారు. నల్లధనం మీద పోరాటం చేస్తామన్న మోడీ..ప్రజల జేబుల్లో ఉన్న డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో వేయించారరని..ఈ డబ్బులను అధిక ధనవంతులు..పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేయాలని మహిళా సంఘాలు కోరుతుంటే...ప్రధాన మంత్రి మోడీ..కేసీఆర్ లు సాధ్యం కాదని చెబుతున్నారని పేర్కొన్నారు. 

Don't Miss