త్వరలో కొత్త రూ. 20..50 నోట్లు..

16:05 - December 4, 2016

ఢిల్లీ : మళ్లీ గిదేంది. ఇప్పటికే పెద్దనోట్లు రద్దు..కొత్త రూ. 2000 నోటుతో బాగా ఇబ్బందులు పడుతున్నాం మళ్లీ రూ. 20, రూ. 50 నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తయారు చేస్తారా ? అని ఏవేవో ఊహించుకోకండి. కొత్తగానే ఈ నోట్లను ముద్రించనున్నారు. కానీ పాత నోట్లు మాత్రం యథావిధిగా చలామణి కానున్నాయి. గత కొన్ని రోజుల కింద రూ. 500, రూ. 1000నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రూ. 2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చింది. అంతేగాకుండా నగదు డ్రా విషయంలో పలు ఆంక్షలు విధించింది. దీనితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా రూ. 20, రూ. 50 నోట్లను కొత్తగా ముద్రించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. పాతనోట్లు చలామాణిలో ఉంటాయని, రూ. 20 నోటులో రెండు అంకెల్లోనూ ఎల్ అనే అక్షరం ఉంటుందని పేర్కొంది. కానీ రూ. 50 నోటులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. ఈ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందని, 2016 ఏడాది అని ముద్రించబడి ఉంటుందన్నారు.

Don't Miss