మహేష్ 25 వ సినిమా ఎవరితో..?

11:51 - December 3, 2016

మహేష్ బాబు ల్యాండ్ మార్క్ మూవీని ఎవరితో చేయబోతున్నాడనేది ఇంట్రెస్ట్ గా మారింది. వరుసగా మురుగదాస్, కొరటాల శివ లతో వరుసగా సినిమాలు చేస్తున్న ప్రిన్స్ 25 వ సినిమా ఏ దర్శకుడితో కమిట్ అవుతాడా అని ఇండస్ట్రీ ఆసక్తిగా చూస్తోంది. మరి ప్రిన్స్ 25 వ సినిమా ఎవరితో చేయబోతున్నాడో మీరు ఓ లుక్కెయండి.
రాజకుమారుడు సినిమాతో మహేష్ ఏంట్రీ 
1999లో రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా ఏంట్రీ ఇచ్చాడు. ఈ పదిహేడేళ్ల కెరీర్ లో ప్రిన్స్ ఇప్పటికీ  వరకు 22 సినిమాలు చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ తో 23 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీమంతుడు కాంబోలో 24 వ మూవీని కూడా స్టార్ట్ చేసాడు. వరుసగా 23,24 సినిమాలకు క్రేజీ డైరెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకున్న ప్రిన్స్ ల్యాండ్ మార్క్ లాంటి 25 సినిమాకి ఏ దర్శకుడిని ఎంచుకుంటాడనేది సన్పెన్స్ గా మారింది.   
25వ సినిమాపై భారీ అంచనాలు 
25వ సినిమా ప్రిన్స్ కి ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకే ఈ సినిమా చాలా స్పెషల్ గా వుండాలని మహేష్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. 25వ సినిమా కోసం మహేష్ బాబు వంశీ పైడిపల్లి లైన్ లో పెట్టినట్లు సమాచారం. ఈ దర్శకుడు ఇప్పటికే ప్రిన్స్ కోసం కత్తిలాంటి స్ర్కిప్ట్ రెడీ చేసాడని టాక్. 
పివిపి బ్యానర్ లోనే మహేష్ 25 సినిమా 
పివిపి బ్యానర్ లోనే మహేష్ 25 సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ ఎడాది ఇదే బ్యానర్ లో ప్రిన్స్ బ్రహ్మోత్సవం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నష్టాలను పూడ్చడానికే పొట్లూరి వరప్రసాద్ నిర్మాతగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు దర్శకుడు వంశీపైడిపల్లిని ఈ సినిమా కోసం ఎంచుకోవడానికి కూడా పీవీపీ బ్యానర్ ఊపిరి లాంటి మొమరబుల్ మూవీ ఇవ్వడమే రిజన్ గా కనిపిస్తుంది. మొత్తానికి మహేష్ బాబు 25 వ సినిమాకి వంశీనే డైరెక్టర్ అనేది ఫిక్స్ అయిపోవచ్చు.

Don't Miss