మోదీ బాణం పేదవారికే తగిలింది : ఉండవల్లి

12:21 - December 8, 2016

ఢిల్లీ : బ్లాక్ మనీని అంతం చేస్తానని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి పేదలు అల్లాడిపోతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. నల్లకుబేరులపై సంధించిన బాణం పేదవారికి తగిలి విలవిల్లాడుతున్నారు. నోట్ల రద్దుపై ప్రజలు పడుతున్న కష్టాలను మీడియా ద్వారా ..చట్ట సభల ద్వారా ప్రభుత్వానికి ప్రజల కష్టాలను విన్నవించమని ఎంపీలకు మాజీ ఎంపీ అరుణ్ కుమార్ సూచించారు. నోట్ల రద్దుపై రిజర్వు బ్యాంక్ ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాల్సిన అవుసరముందో చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన రోజుల్లోనైనా నోట్ల రద్దుపై చర్చ జరిగేలా చూడాలని విపక్ష ఎంపీలకు ఉండవల్లి సూచించారు. ఈ సంక్షోభానికి కారణమేంటి? ఈ కష్టాలు ఎన్నాళ్లు కొనసాగుతాయని ప్రశ్నించారు. చేతిలో నగదు వుండి కూడా పేదరికం అనుభవించాల్సిన పరిస్థితులు దేశంలో నెలకొంటున్నాయన్నారు.నోట్ల రద్దుతో మిడిల్ క్లాస్ నుండి దిగువ స్థాయివారే ఇబ్బందులు పడుతున్నారు తప్ప ధనవంతులకు ఎటువంటి కష్టం లేదన్నారు. 

Don't Miss