చిల్లర లేమితో విజయవాడ ఆసుపత్రి వెలవెల..

16:28 - December 2, 2016

విజయవాడ : కరెన్సీ సమస్యలు కొనసాగుతున్నాయి.. రోజులకొద్దీ బ్యాంకులచుట్టూ తిరుగుతున్నా క్యాష్ దొరక్క స్థానికులు అవస్థలు పడుతున్నారు..మరోపక్క చిల్లర లేమితో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చిల్లర లేమితో వెలవెలబోతోంది. నిత్యం రోగులతో ఎంతో రద్దీగా వుండే ఈ ఆసుపత్రి రోగులు లేక వెలవెలబోతోంది. దీని ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది ఏమంటున్నారో చూద్దాం..అవినీతిని అరికట్టే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు మంచి పద్ధతేనని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. తమ ఆసుపత్రిలో పాతనోట్లతోనే వైద్యం అందిస్తున్నామని డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో పాతనోట్లను స్వీకరించి వైద్యం చేస్తేనే రోగులకు వైద్యం అందించే అవకాశం వుంటుందనీ.. పాతనోట్లను ఆసుపత్రిలో కొత్తే నోట్లే కావాలని పట్టుపడితే అది మానవత్వం కాదని ఆసుపత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. నోట్ల రద్దు అనంతరం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య దాదాపు 50 శాతం తగ్గిపోయిందని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. రోగులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకుండా వారు తెచ్చిన క్రెడిట్ కార్డులతో వచ్చే వారు 20శాతం మంది వుంటే .. పాతనోట్లతో వచ్చేవారు 80శాతంమంది వున్నారనీ..రోగులు అవసరాన్ని బట్టి సానుకూలతను బట్టి వైద్యం అందిస్తున్నట్లుగా ప్రసాద్ తెలిపారు. దాదాపు 80 శాతం పాతనోట్లతోనే వైద్యం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆన్ లైన్ వ్యవహారాలు పూర్తిస్థాయి అమలు జరగటానికి సుదీర్ఘకాలం పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. చిల్లర లేమితో 90శాతం కొనుగోలు ఆగిపోయిందనీ.. మెడికల్ షాపు యజమాన్యులు పేర్కొంటున్నారు.

Don't Miss