చిరంజీవి..పవన్ తో సినిమా ?

16:27 - December 2, 2016

మెగా బ్రదర్స్ వెండి తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది. అందులో 'చిరంజీవి'..'పవన్ కళ్యాణ్' కలిసి నటిస్తే ? ఇంకేముందు మెగా అభిమానులకు పండుగే పండుగ. కానీ కథ ఉండాలి కదా ? అని అనుకుంటుంటారు. అలాంటి కథ సిద్ధమైందని...వీరిద్దరూ నటించనున్నారని టాలీవుడ్ లో..సోషల్ మాధ్యమాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కోరిక త్వరలోనే నిజం కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'చిరంజీవి' వెండితెరపై త్వరలోనే కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు 'పవన్' కూడా వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నారు. అంతేగాకుండా 'పవన్' నిర్మాతగా మారి చిత్రాలు కూడా నిర్మించే యోచనలో ఉన్నారనే సంగతి తెలిసిందే. తొలిగా 'నితిన్'తో ఓ సినిమా కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంచితే...'చిరంజీవి'ని ఇటీవలే మాటల మాంత్రికుడు 'తివిక్రమ్' కలిసినట్లు..ఓ చిత్రం కథ గురించి తెలియచేసినట్లు తెలుస్తోంది. 'పవన్' నిర్మాత అని 'తివిక్రమ్' పేర్కొనడం..'చిరు' సై అనడం జరిగిపోయాయని టాక్. 'తివిక్రమ్' తీసిన సినిమాలు ఎలాంటి విజయాలు నమోదు చేశాయో తెలిసిందే. దీనితో 'చిరు' కూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఒకవేళ నిజమైతే 'చిరు' 151 లేదా 152వ సినిమా ఇదే అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. 

Don't Miss