పవన్‌కల్యాణ్‌ కు ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం ఎక్సలెన్స్‌ అవార్డు

20:00 - November 18, 2017

హైదరాబాద్ : లండన్‌లోని ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరం ఎక్సలెన్స్‌ అవార్డును హీరో.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తానెప్పుడూ సామాజిక న్యాయంవైపే నిలబడతానని అన్నారు. 'భారత్‌లో పెట్టుబడికి అవకాశాలు' అనే అంశంపై పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. భారత్‌ భిన్నత్వానికి నిదర్శనమని, ధనవంతులు, పేదవారు ఇద్దరికీ అక్కడ చోటు ఉంటుందన్నారు. భారత్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. తనకు లభించిన అవార్డు నిస్వార్థంగా సేవలు చేస్తున్న ప్రతీ భారతీయుడికీ అంకితం ఇస్తున్నట్లు పవన్‌ తెలిపారు. అంతకుముందు లండన్‌లోని అంబేడ్కర్‌ స్మారక మందిరాన్ని పవన్‌కల్యాణ్‌ సందర్శించారు. 

 

Don't Miss